మనతెలంగాణ/హైదరాబాద్:తనకు తెలియకుండానే ఐఏఎస్‌లను బదిలీ చేయడంపై సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రె డ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఐ ఏఎస్‌లు తమ బదిలీ గురించి సిఎంకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అయినట్టుగా సమాచా రం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చిన రోజునే అంతర్గతం గా ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బదిలీ అయిన ఐఏఎస్‌లు బుధవారం విధుల్లో చేరడానికి వెళ్లినప్పుడు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి అభ్యంతరం చెప్పడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నుంచి అనుమతి తీసుకొని రావాలని వారి కి సూచించడంతో ప్రస్తుతం ఈ విషయం బయటకు వచ్చినట్టుగా తెలిసింది.
దీంతోపాటు ఒక ఐఏఎస్‌ను అడిషనల్ సీఈఓగా బదిలీ చేసే సమయంలో ఆయన పేరును ప్రతిపాదించే ముందు కనీసం సిఎం రేవంత్‌రెడ్డికి ఆ ఐఏఎస్ నుంచి కూడా అనుమతి తీసుకోకుండా ఈ బదిలీ చేశారని ఈ నేపథ్యంలో ఆ ఐఏఎస్ కూడా సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతో జిఏడిలోని ఓ అధికారి నుంచి సిఎం రేవంత్‌రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఆయన సీనియర్ ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు ఎలా తీసుకొస్తారని సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రెడ్డి మొట్టికాయలు వేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ తరువాత కొందరు సీనియర్ ఐఏఎస్‌లపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.