యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ‘భీమవరం బల్మా’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య ఈ సాంగ్ కు నవీన్, మీనాక్షీ డ్యాన్స్ చేసి హుషారెత్తించారు.
ఇక, విడుదలైన లిరికల్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ రూపొందుతోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ మూవీ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది.