విద్యుత్ తీగలు తగిలి లారీకి మంటలు అంటుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం పెంజర్ల గా్రమం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామనికి గడ్డిని లారీలో తరలిస్తుండగా విద్యుత్ తీగలు లారీకి తగిలి మంటలు అంటుకున్నాయి. అది గమనించకుండా లారీ డ్రైవర్ కొంచెం దూరం అలానే వెళ్లాడు. స్థానికులు తెలపడంతో లారీ డ్రైవర్ లారీని పక్కనే ఉన్న పంటపొలాల్లోకి తీసుకెళ్లి ఆపాడు. మంటలు ఎక్కువకావడంతో లారీని దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి నీళ్లతో మంటలను ఆర్పాడు. ఈ ఘటనలో లారీ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై గడ్డి కట్టలు పడడంతో అందులోంచి వంచిన పోగతో వాహదారులు తీవ్ర ఇబ్బందికి గురైనారు.