న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ కోసం గురువారం మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మ రికార్డు ధరను దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రూ.3.2 కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.3 కోట్లు వెచ్చించి అమేలియాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తెలుగమ్మాయి శ్రీ చరణీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్ పోటీపడ్డాయి. రూ.1.3 కోట్లకు ఆమెను ఢిల్లీ సొంతం చేసుకుంది. పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు భారీ ధరలనే దక్కించుకున్నారు. ఇక, ఈ మెగా వేలంలో కొంతమంది ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలారు.
సోల్డ్, అన్‌సోల్డ్ ప్లేయర్ల జాబితా:
సోల్డ్ అయిన ప్లేయర్లు
దీప్తి శర్మ – రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్) – RTM
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ – రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్)
న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ – రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
రేణుకా సింగ్ ఠాకూర్ – రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ – రూ.85 లక్షలు (యూపీ వారియర్స్) – RTM
ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ – రూ.1.9 కోట్లు (యూపీ వారియర్స్)
సౌతాఫ్రికా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్ – రూ. 1.1 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
భారతి ఫుల్మాలి – రూ.70 లక్షలు (గుజరాత్ జెయింట్స్) – RTM
ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ – రూ. 1.2 కోట్లు (యూపీ వారియర్స్)
జార్జియా – రూ. 60 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
కిరణ్ నవ్‌గిరే -రూ. 60 లక్షలు (యూపీ వారియర్స్) – RTM
వెస్టిండీస్ ప్లేయర్ చినెల్లే హెన్రీ – రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
శ్రీ చరణి – రూ. 1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ లారెన్ బెల్-రూ.90 లక్షలు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
నాడిన్ డి క్లర్క్ – రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్- రూ.60 లక్షలు(ముంబై ఇండియన్స్)
స్నేహ రానా – రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
రాధా యాదవ్ – రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
హర్లీన్ డియోల్ – రూ. 50 లక్షలు (యూపీ వారియర్స్)
లిజెల్ లీ – రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
ఇంగ్లాండ్ బౌలర్ లిన్సే స్మిత్- రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
అన్‌సోల్డ్
అలిస్సా హీలీ
గ్రేస్ హారిస్
సబ్బినేని మేఘన
తజ్మిన్ బ్రిట్స్
అమీ జోన్స్
ఇజ్జీ చూపులు