మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు పెద్ది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన చికిరి లిరికల్ వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్, సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఇప్పటికే 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ సాంగ్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్ చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ పై వరల్డ్ వైడ్ గా వేల రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మర్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ది మూవీ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.