హైదరాబాద్: భారత్ లో నాణ్యమైన మ్యానుఫాక్చరింగ్ వ్యవస్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ లో అంతరిక్షరంగం నిపుణులకు కొదవ లేదని అన్నారు. హైదరాబాద్ రావిర్యాలోని మోడీ చేతుల మీదుగా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కైర్యూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు. భారత్ అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలు రాయి అని.. స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని కొనియాడారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని, భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. స్పేస్ సెక్టార్ లో కోఆపరేటివ్, ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చామని, జన్ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్ లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు.