అమరావతి: తిరుమలలో ఎన్నో సంస్కరణలు, ప్లాస్టిక్ బ్యాన్ చేశామని టిడిపి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తన హయాంలో టిడిపిలో అవినీతి అనేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసిపి ప్రభుత్వంపై విమర్శించారు. రాజకీయాల కోసం ఆలయాలను వాడుకుంటున్నారని, తాను తప్పు చేసి ఉంటే.. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తా? అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టిటిడి లడ్డూ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని తెలియజేశారు. కల్తీ నెయ్యి అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
తమ హయాంలో రూ. 326కి నెయ్యి కొంటే కల్తీ జరిగిందని అంటున్నారని, 2014-19 మధ్య నెయ్యిని రూ. 270 కి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. మరి అప్పుడు కల్తీ జరిగినట్టు కాదా? అని ప్రశ్నించారు. 2019- 24 సమయంలోనే కాదు.. అంతకుముందు కూడా దర్యాప్తు జరిపించాలని సూచించారు. టిటిడి ద్వారా లాభపడాలని తనకు, తన కుటుంబానికి లేదని అన్నారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని, పరకామణి అంశంలో రేపు విజయవాడలో సిఐడి విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు పిఎ మాత్రమేనని.. తర్వాత తనతో లేరని, టిటిడి వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని.. అదే విషయం సిట్ కు చెప్పానని అన్నారు. శ్రీవారి దర్శనానికి అప్పన్న వచ్చారేమో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.