అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులు, దారి తప్పాడు. విద్యార్థులు పక్కటి దారి పడితే సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు. కామ బుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ కాలేజీలో బక్కవంతుల వినయ్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పలుమార్లు అతడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు కాలేజీలో వినయ్‌ను చితకబాదారు. అనంతరం డిఇఒకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అతడు బిసి సంఘాల నాయకుడిగా పని చేసినట్టు సమాచారం. వినయ్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.