ముంబయి: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్ వాష్‌కు గురికావడంతో కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత జట్టు వైట్ వాష్‌కు గురికావడంతో హెడ్ కోచ్‌ను పదవి నుంచి గంభీర్ ను తొలగించాలని క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రెండో టెస్టులో ఓటమి తరువాత బర్సపారా క్రికెట్ స్టేడియంలో గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ సిరాజ్‌తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్న అభిమానులు ఆగలేదు. గంభీర్ హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్‌లో కూడా బిసిసిఐదే తుది నిర్ణయమని గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బిసిసిఐ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జట్టులో పెద్ద ఎత్తున మార్పుల చేయాలని బోర్డు భావిస్తోందన్నారు. జుట్టు కూర్పు సరిగా లేదని, టి20ల ఆధారంగా జట్టులోకి ఆటగాళ్లను తీసుకోవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి.