ప్రపంచ రాజకీయాల్లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమ్మిట్ ఒక కొత్త మలుపని చెప్పాలి. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు కలిసి ఐబిఎస్‌ఎ ఇబ్సా (ఇండియా, -బ్రెజిల్-, సౌత్ ఆఫ్రికా) సదస్సు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు చిహ్నంగా మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరమని మోడీ స్పష్టం చేశారు. ఇది ఐచ్ఛికం కాదు. ఇది ఆవశ్యకత అని ఆయన ఒత్తిడి చేశారు. ప్రపంచంలో విభజనలు, అడ్డుగోడలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఐబిఎస్‌ఎ ఐక్యత మానవతా విలువలను ప్రదర్శిస్తుంది. ఈ మూడు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని మోడీ పిలుపునిచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుల సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వంద్వ ప్రమాణాలు లేవని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమ్మిట్ గ్లోబల్ గవర్నెన్స్‌లో మార్పులకు మార్గం సుగమం చేస్తున్నది.
ఈ సమ్మిట్‌లో టెక్నాలజీ పాత్రపై చర్చ ఆకర్షణీయంగా ఉంది. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకమని మోడీ చెప్పారు. భారతదేశంలోని యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), కోవిన్ వంటి ఆరోగ్య ప్లాట్‌ఫారమ్‌లు ఉదాహరణలుగా పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, మహిళల సాధికారతలో టెక్నాలజీ కార్యక్రమాలు పంచుకోవాలని ఆయన సూచించారు. ‘ఐబిఎస్‌ఎ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్’ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇది మూడు దేశాల్లోని 40కి పైగా దేశాలకు విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ ఎనర్జీ వంటి కార్యక్రమాలకు నిధులు అందిస్తుంది. ఐబిఎస్‌ఎ ఇప్పటికే ఈ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఉదాహరణకు, ఐబిఎస్‌ఎ ఫండ్ ద్వారా 2023 నుండి 2025 వరకు 15 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఇవి వాతావరణ మార్పులు, పంటల దిగుబడి, తృణధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగపడ్డాయి. విపత్తు నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రతలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు. ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ చర్చలు గ్లోబల్ సౌత్‌కు మార్గదర్శకాలుగా మారతాయి.
జి-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) సందర్భంగా మోడీ, రమఫోసా సమావేశం మరింత ప్రాముఖ్యత పొందింది. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, ఆహార భద్రతపై విస్తృత చర్చ జరిగింది. భారత్- దక్షిణాఫ్రికా సంబంధాల పురోగతిని సమీక్షించారు. జి-20 సారథ్యంలో దక్షిణాఫ్రికాకు మోడీ అభినందనలు తెలిపారు. రమఫోసా మాటల్లో భారత్ ఆతిథ్యాన్ని చూసి నేర్చుకున్నామని చెప్పారు. ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. దక్షిణాఫ్రికా జి-20 సారథ్యానికి భారత మద్దతుకు రమఫోసా కృతజ్ఞతలు చెప్పారు. ఈ బైలాటరల్ డైలాగ్‌లు ఐబిఎస్‌ఎని మరింత బలపరుస్తాయి. మోడీ ఆదివారం కెనడా ప్రధాని, జపాన్ ప్రధాని, ఇటలీ ప్రధాని, జమైకా, నెదర్లాండ్స్ అధినేతలతో సమావేశాలు జరిగాయి. వ్యాపారం, పెట్టుబడులు, కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్) ఎండి (మేనేజింగ్ డైరెక్టర్) క్రిస్టలీనా జార్జివాతో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశాలు ఐబిఎస్‌ఎని గ్లోబల్ ప్లాట్‌ఫారంగా మార్చాయి.
భారత మీడియాలో ఈ సమ్మిట్ కు స్వాగతం పలికాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్‌లో మోడీ ప్రతిపాదనలు ప్రశంసలు అందుకున్నాయి. యుఎన్‌ఎస్‌సి (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్) సంస్కరణలు అత్యవసరమని మోడీ చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. టెక్నాలజీ అలయన్స్, ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతపై ఫోకస్ చేశాయి. దక్షిణాఫ్రికా మీడియాలో మోడీకి ప్రశంసల వర్షం కురిసింది. ఐఒఎల్ న్యూస్, గల్లీ న్యూస్‌లో ఆయన ఆతిథ్యం, సహకార ఆలోచనలు పాజిటివ్‌గా చిత్రీకరించబడ్డాయి. సోషల్ మీడియాలో సౌత్ ఆఫ్రికన్లు మోడీని ‘ఇంప్రెస్’ అని పోస్ట్ చేశారు. బ్రెజిల్ మీడియా, జీ న్యూస్‌లో లూలా,- మోడీ సమావేశం ప్రశంసించబడింది. అంతర్జాతీయంగా, బ్లూంబర్గ్, చాతమ్ హౌస్‌లో ఐబిఎస్‌ఎని గ్లోబల్ సౌత్ ఐక్యతగా చూశారు. బిఆర్‌ఐసిఎస్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) విస్తరణతో పోల్చి, ఐబిఎస్‌ఎని మరింత డెమొక్రాటిక్‌గా అభివర్ణించారు. యూ ట్యూబ్ చానెళ్ళు, డబ్ల్యూఐఒఎన్, జీ న్యూస్‌లో మోడీ మాటలు వైరల్ అయ్యాయి. ఈ ప్రతిస్పందనలు సమ్మిట్ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు విమర్శలు కూడా చేశాయి. బెల్ఫర్ సెంటర్‌లో దక్షిణాఫ్రికా ప్రభావం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. జి20లో యుఎస్ (యునైటెడ్ స్టేట్స్) ఆపోజిషన్‌తో సమ్మిట్ బలహీనపడిందని చాతమ్ హౌస్ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు గ్లోబల్ కాంపిటీషన్‌ను హైలైట్ చేస్తాయి.
ఈ సమ్మిట్‌కు అమెరికా నుండి మిశ్రమ స్పందన వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి వచ్చిన తర్వాత, యుఎస్ టారిఫ్ పాలసీలు ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాను దగ్గర చేశాయి. బ్లూంబర్గ్ ప్రకారం ట్రంప్ ఆటాక్స్ ఐబిఎస్‌ఎని ఎకనామిక్ ఇంటిగ్రేషన్ వైపు మళ్ళించాయి. ట్రంప్ యుఎన్‌ఎస్‌సి సంస్కరణలపై స్పష్టమైన అభ్యంతరాలు చెప్పలేదు. కానీ, అతని పాలసీలు గ్లోబల్ సౌత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. జీ-20 జోహన్నెస్‌బర్గ్ సమ్మిట్‌ను యుఎస్ బాయ్‌కాట్ చేసింది. ఈ చర్య ఆఫ్రికా ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యూట్యూబ్ వీడియోల్లో బిఆర్‌ఐసిఎస్ మెంబర్ విజయ్ సర్దానా ట్రంప్‌ను విమర్శించారు. యుఎస్ బాయ్‌కాట్‌ను ‘అరొగెన్స్’ అని వ్యాఖ్యానించారు. అయితే, యుఎస్ యుఎన్‌ఎస్‌సి రిఫారమ్స్‌కు తన మద్దతు ఇస్తోంది. యుఎస్ మిషన్ ప్రకారం, ఆఫ్రికాకు రెండు పర్మనెంట్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇందుకు 54 ఆఫ్రికన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో యుఎస్, చైనా, రష్యా గ్లోబల్ సౌత్‌కు పోటీ పడుతున్నాయని చెప్పారు. విల్సన్ సెంటర్‌లో యుఎస్ ప్రతిపాదనలు వీటో పవర్ లేకుండా ఉన్నాయని విమర్శించారు. ఇది అసమానత్వాన్ని కొనసాగిస్తుందనే అభిప్రాయం వెల్లడైంది. ట్రంప్ హయాంలో యుఎస్ మల్టీలాటరలిజ్‌ను వదులుకుంటోంది. ఐబిఎస్‌ఎ సమ్మిట్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతకు యుఎస్ మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, ట్రంప్ టెర్రర్ పాలసీలు ద్వంద్వ వైఖరిని కలిగి ఉన్నాయి. ఇండియా పై టారిఫ్‌లు, దక్షిణాఫ్రికా మైనింగ్‌పై రిబ్యూక్‌లు ఐబిఎస్‌ఎని మరింత బలపరుస్తున్నాయి. ఈ అభిప్రాయాలు సమ్మిట్‌ను విమర్శనాత్మకంగా చూస్తున్నాయి. యుఎస్ గ్లోబల్ ఆర్డర్‌ను మార్చాలంటే ఐబిఎస్‌ఎ వంటి ఫోరమ్‌లు అవసరమని అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది.
ఐబిఎస్‌ఎ సమ్మిట్ గ్లోబల్ చాలెంజెస్‌కు సమాధానాలు సూచిస్తుంది. వాతావరణ మార్పులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచి అడుగు. సిఒపి 28 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28)లో ట్రిపుల్ అడాప్టేషన్ ఫైనాన్స్ కమిట్‌మెంట్‌లా ఇది ప్రభావవంతమవుతుంది. డిజిటల్ అలయన్స్ భారత యుపీఐ వంటి మోడల్స్‌ను బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు విస్తరిస్తుంది. 2025 నాటికి 40 దేశాల్లో 20 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఉగ్రవాదంపై ద్వంద్వాలు లేకుండా ఐక్యత అవసరం. మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో టెర్రర్ దాడులు 2024లో 30 శాతానికి పెరిగాయి. ఐబిఎస్‌ఎ ఈ విషయంలో లీడ్ చేయాలి. యుఎన్‌ఎస్‌సి సంస్కరణలు ఆలస్యమవుతుంటే, గ్లోబల్ పీస్ ప్రభావితమవుతుంది. 193 యుఎన్ (యునైటెడ్ నేషన్స్) మెంబర్ దేశాల్లో 54 ఆఫ్రికన్ దేశాలు రిఫారమ్స్‌కు తమ మద్దతును తెలిపాయి. ఇండియా, బ్రెజిల్ స్థిరపడిన సీట్లకు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ సమ్మిట్ జీ-20 ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. భారత జీ20 సారథ్యంలో ఆఫ్రికా యూనియన్‌ను చేర్చడం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా జీ-20లో డెవలపింగ్ ఎకనామీస్ ప్రయారిటీలు ముందుకు తీసుకు వచ్చింది.
డిసాస్టర్ రెసిలియెన్స్, డెబ్ట్ సస్టైనబిలిటీ, క్రిటికల్ మినరల్స్‌పై ఫోకస్ జరిగింది. విమర్శనాత్మకంగా చూస్తే, ఐబిఎస్‌ఎ ప్రభావం ఇంకా పరిమితమనే చెప్పాలి. బిఆర్‌ఐసిఎస్ విస్తరణతో (2023లో 6 కొత్త మెంబర్లు) ఐబిఎస్‌ఎ షాడోలో పడవచ్చు. ట్రిపార్టీట్ ఫండ్ 2004లో 1 మిలియన్ డాలర్లతో మొదలైంది. కానీ, 2025 నాటికి 50 మిలియన్‌కు తగ్గింది. ఇది ఫైనాన్సింగ్ లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇంకా టెక్నాలజీ అలయన్స్ రూల్స్ క్లియర్ కావాలి. డేటా ప్రైవసీ, సైబర్ థ్రెట్స్‌పై గ్లోబల్ స్టాండరడ్స్ అవసరం. యుఎస్ బాయ్‌కాట్‌తో జీ-20 ఫ్రాగ్మెంటేషన్ పెరిగింది. ట్రంప్ పాలసీలు డెవలపింగ్ వరల్డ్ ఒంటరిని (ఐసోలేట్) చేయాలని చూస్తున్నాయి. ఇది మల్టీలాటరలిజానికి గెలవడం కష్టతరం చేస్తుంది. ఐబిఎస్‌ఎ ఈ చాలెంజ్‌లను అధిగమించాలి.
మూడు దేశాల్లో జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) మొత్తం 2025లో 10 ట్రిలియన్ డాలర్లు. ఇది ఇయు (యూరోపియన్ యూనియన్) తో పోటీ పడుతుంది. కానీ, ట్రేడ్ వాల్యూమ్ ఇంకా తక్కువ. 2024లో ఐబిఎస్‌ఎ ట్రేడ్ 100 బిలియన్ డాలర్లకు చేరలేదు. ఈ లోపాలను వీలున్నంత వరకు భవిష్యత్తులో సరిదిద్దాలి. ట్రంప్ టారిఫ్‌లు (ఇండియా మీద 25 శాతం) ఐబిఎస్‌ఎ ని ఆటోమేటిక్‌గా దగ్గర చేస్తున్నాయి. ఇది పాజిటివ్ ట్విస్ట్ గా మనం చెప్పుకోవాలి. గ్లోబల్ సౌత్‌లో ఇలాంటి ఫోరమ్‌లు పెరగాల్సి ఉంది. ఐబిఎస్‌ఎ సమ్మిట్ ఆశయదాయకంగా జరిగింది. యుఎన్‌ఎస్‌సి రిఫార్మ్, టెక్నాలజీ, క్లైమేట్ సహకారాలు భవిష్యత్తుకు ఒక నూతన ఆకృతిని ఇస్తాయి. మొత్తానికి మీడియా ప్రతిస్పందనలు ఐక్యతను హైలైట్ చేశాయి. యుఎస్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ట్రంప్ పాలసీలు ఐబిఎస్‌ఎని మరింత బలపరుస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్ లో మరి కొన్ని మార్పుల అవసరం ఉంది. ఐబిఎస్‌ఎ ఈ మార్పువకు ముందడుగు పడినట్టే. ఈ ఐక్యత ముందు, ముందు ప్రపంచాన్ని మార్చ గలదు.
– డా. కోలాహలం రామ్ కిశోర్
– 9849328496