వాషింగ్టన్ : అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి. నేషనల్ గార్డ్స్పై దుండగుడు కాల్పులు జరిపారు. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల ఈ ఘటనపై మండిపడ్డారు. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదని, మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. ట్రంప్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.