రాయలసీమ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా తీసిన దేవగుడి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, కథా నాయక,నాయికలు అభినవ్ సౌర్య, అనుశ్రీలు కోరారు. బుధవారం మదనపల్లిలోని గోల్డెన్ వాలి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ నేపధ్యంలో దేవగుడి కటెంట్‌ను తీసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషన్ డ్రామాగా సినిమా సాగుతుందన్నారు. డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ వాలి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కరస్పాండెంట్ ఎన్‌వి రమణా రెడ్డి , క్యాంపస్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రిన్సిపాల్ డా.మనోహర్‌లతో పాటు దేవగుడి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.