హన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.