రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం తెలుగు వెర్షన్ ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకునేలా, అతి సామాన్యులు రాజ్యాంగంపై అవగాహాన పొందేలా తెలుగు వెర్షన్ రూపోందించినట్లు లా కార్యదర్శి బి. పాపిరెడ్డి సిఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రాంతీయ భాషలో రాజ్యాంగ అనువాదం మంచి నిర్ణయమన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకోవచ్చని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లా అదనపు కార్యదర్శి కె.సునీత, సంయుక్త కార్యదర్శి కె.గీత తదితరులు పాల్గొన్నారు.