న్యూఢిల్లీ: దయచేసి ఆగండి. నేను మీకు త్వరలోనే కాల్ చేస్తాను అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్‌కు ఓ సందేశం పంపించారు. రెండు మూడురోజుల్లోనే, డిసెంబర్ 1లోగానే కర్నాటక సిఎం పదవిపై తేలుస్తామని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ సమాచారం కీలకంగా మారింది. తాను ఈ నెల 29న సోనియాగాంధీతో ఈ విషయం చర్చిస్తానని కూడా రాహుల్ ఇప్పుడు డికెకు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని రాహుల్ ఇటీవలే ఢిల్లీకి వచ్చారు.
డికె తనను సంప్రదించేందుకు యత్నించారని, తానే ఆయనకు తన సందేశం పంపిస్తున్నానని తెలిపారు. మరో వైపు బుధవారం రాత్రి డికె, సిద్ధరామయ్యల మధ్య ఆంతరంగిక సమావేశం జరిగింది. మరో వైపు ఈ నెల 29నే సోనియా గాంధీని, రాహుల్‌ను ఇతర నేతలను కలిసేందుకు డికె ఢిల్లీకి వెళ్లుతున్నట్లు ఆయన సన్నిహితులు బెంగళూరులో తెలిపారు. ప్రస్తుత పరిణామాలతో కర్నాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడి అందుకున్నాయి. మరో వైపు కర్నాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లాడినట్లు స్పష్టం అయింది.