వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని, భారతదేశం అంతటితో పోలిస్తే ఇది రెండింతలు పైగా ఉందని , ఇంతకంటే ఫ్రాడ్ మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. అమెరికా మాజీ రాయబారి అయిన బ్రాట్ భారత్‌కు ఉన్న హెచ్ 1 బి వీసాల పరిమితి 85000 అని, అయితే చెన్పై కన్సల్టెంట్‌కు రెండున్నర లక్షల వీసాలు దక్కాయని తెలిపారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకల హెచ్ 1బి వీసాల దరఖాస్తుల ప్రాసిసింగ్‌లో ఉండే ఈ కంపెనీకి ఇన్ని వీసాలు మంజూరు కావడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో హెచ్ 1 బి వీసాల అంశం ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అయింది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ అంతాకూడా పారిశ్రామిక వర్గాల స్థాయి స్కామ్‌లు పావులు ఎత్తుగడల గుప్పిట్లోకి జారుకుందని విమర్శించారు. చట్టబద్ధమైన అధికారిక పరిమితి దాటి వీసాలు జారీ అయితే ఇక ఈ ప్రక్రియకు విలువ ఏమిటని హెచ్ 1 బి వీసాల వాటాల్లో 71 శాతం వరకూ ఇండియాకు చెందుతాయి.
కాగా చైనాకు కేవలం 12 శాతం కోటా దక్కుతోంది. భారత్‌కు సంబంధించి 85000 వీసాల పరిమితి ఉంది.అయితే కానీ ఇండియాలోని చెన్నై జిల్లా లేదా పూర్వపు మద్రాసు జిల్లకు రెండులక్షలకు పైగా హెచ్ 1 బి వీసాలు దక్కాయని రిపబ్లికన్ మాజీ ఎంపి అయిన డాక్టర్ బ్రాట్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల వీసాల ప్రాసిసింగ్ సెంటర్‌గా చెన్నై కన్సల్టెంట్ సెంటర్ ఉంది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ ఇంత యధేచ్ఛగా మోసాల భరితం అయి ఉంటే ఇక అమెరికా వర్కర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా), యాంటి ఇమిగ్రేషన్ అజెండా వంటివి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు.