వయో వృద్ధులకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ వివిధ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రస్థాయి వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెం డర్స్ వ్యక్తుల సాధికారత శాఖ బంజారాహిల్స్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియం లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వయో వృద్ధులకు పెన్షన్‌లు, ప్రతి జిల్లాలో వయో వృద్ధుల ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు మన రాష్రటంలో 13 జిల్లాల్లో వృద్ధ ఆశ్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మిగతావి వివిధ దశలలో పూర్తి చేస్తామని అన్నారు. తల్లి దండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 ప్రకారముగా ప్రతి జిల్లాలో మెయింటెనెన్స్ ట్రిబునళ్లు, అప్పీల్లేట్ ట్రిబునళ్లను ఏర్పాటు చేశామన్నా రు. అంతేకాకుండా రాష్టంలోని ప్రతి జిల్లాలో వయో వృద్ధుల కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు.
ఇట్టి వారోత్సవాలకు ఆయా జిల్లాలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో వయో వృద్ధులకు ఆటల పోటీలు, జిల్లా స్థాయి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారన్నారు. వయో వృద్ధుల సంక్షేమము కొరకు రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని మంతరి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 నియమాలను సూచిం చే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఐఎఎస్ అనితా రామచంద్రన్, సంచాలకులు బి.శైలజ, రాష్ట్రస్థాయి అధికా రులు, వివిధ వయో వృద్ధుల సంఘాల ప్రతినిధులు, 1500 మంది వయో వృద్ధులు పాల్గొన్నారు.