గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.234కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది బైక్‌పై గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 84 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రెహమాన్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం హుస్సేన్‌ను బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.