ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో దారుణంగా హత్య చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. పాక్ సోషల్ మీడియాలో, ఆఫ్ఘన్ మీడియాలలోనూ ఇమ్రాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు వద్దకు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇమ్రాన్ హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాలను ఇది మరింత తీవ్రతరం చేసింది. మరోవైపు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపారని.. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రను అమలు చేశారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, అవినీతి కేసులో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్.. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.