టీం ఇండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటు చేుసకుంది. అతడి భార్య సోదరుడు జీత్ రిసిఖ్‌భాయ్ పబారీ బుధవారం రాజ్‌కోట్‌లోని నివాసంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ప్రాణం ఉందనే ఆశతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. జీత్ ఆత్మహత్యకు గత కారణాలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
2024లో జీత్ రసిఖ్‌భాయ్‌పై తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం జీత్ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధానికి బలవంతం చేశాడని ఆరోపించింది. వారి నిశ్చితార్థం తర్వాత కూడా వేధింపులు కొనసాగాయని.. ఆ తర్వాత అతను ఒక్కసారిగా బంధం తెంచుకున్నాడని పేర్కొంది.