బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించబోతున్న సెకండ్ మూవీ ఎలమ్మ. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, నితిన్ తోపాటు పలువురు యంగ్ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని..ఎట్టకేలకు ఈ సినిమాకు హీరో దొరికాడని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అలాగే,ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై కీర్తి సురేష్ స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కీర్తి.. మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది.
కాగా, తమిళ్ లో క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘రివాల్వర్ రీటా’ను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ తోపాటు రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేష్ రౌడీ జనార్థనా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.