బీజాపూర్: కేంద్ర బలగాలు చేపడుతున్న ఆపరేషన్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ కమాండోలతోపాటు పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సలైట్ల తలలపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన 41 మంది నక్సలైట్లలో 39 మంది దక్షిణ సబ్-జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టులకు చెందినవారుగా పోలీసులు వెల్లడించారు. వారందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, నిషేధిత సంస్థ ధమ్తారి-గరియాబంద్-నువాపాడ విభాగాలతో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర కమాండర్ హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.