గౌహతి: భారత్-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సఫారీ జట్టు 408 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. 25 ఏళ్ల తరువాత సఫారీ జట్టు టెస్టు సిరీస్ ను గెలిచింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 63.5 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. హర్మర్ బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ల కకావికలమయ్యారు. స్పిన్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోయారు. రవీంద్ర జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.