ఢిల్లీ: రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు. మన ప్రజాస్వామ్యం వ్యవస్థకు మూలం రాజ్యాంగం అని ప్రశంసించారు. సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ మర్ము నేతృత్వంలో రాజ్యాంగ దినోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని, రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశానని, సామాజిక న్యాయం సాధనలో భాగమే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అని ద్రౌపదీ ముర్మూ తెలియజేశారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని, ఆర్థిక ఏకీకరణలో భాగంగా జిఎస్‌టి తీసుకొచ్చామని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగామే మార్గదర్శి అని అన్నారు. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామని, ఇటీవలే బిర్సాముండా 150వ జయంతిని జరుపుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,