అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతం టిడిపిలో పేకాట పంచాయితీ వెలుగులోకి వచ్చింది. హునాపురంలోని టిడిపి నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసుల దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతూ 16 మంది టిడిపి నేతలు పట్టుబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి పేకాటరాయుళ్ల నుంచి రూ.89,020 నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లలో టిడిపి నేత కాకర్ల రంగనాథ్ ఉన్నట్లుగా మరో టిడిపి వర్గం ఆరోపణలు చేస్తుంది. కొంతకాలంగా టిడిపి నేత జెసి ప్రభాకర్‌రెడ్డి – టిడిపి నేత కాకర్ల మధ్య వివాదాలు ఉన్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడిపిలోని కాకర్ల వర్గం ఆరోపణలు చేస్తుంది. జెసి ధర్నాకు సిద్ధమైన తర్వాతే కాకర్ల రంగనాథ్, ఆయన సోదరుడు జయనాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.