లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాఖేర్వా- గిరిజపురి జాతీయ రహదారిపై శార్థా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడడంతో ఆస్పత్రి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సిఎం సంతాపం తెలిపారు.