ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది.
ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “-ఈ కథని ఒక ప్రేక్షకుడిగా విన్నాను. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన భావోద్వేగం ఉంది. అందరి జీవితంలో ఇలాంటి భావోద్వేగం వుంటుంది. అది నాకు ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యింది. అసలు అభిమానుల ప్రేమకు లాజిక్ వుండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు? దానికి మనం అర్హులమేనా? అనిపిపిస్తుంటుంది కదా. అందుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో సూపర్ స్టార్ సూర్య క్యారెక్టర్… ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనిషి భావోద్వేగాలు, ప్రేమ, ధనవంతుడు, పేదవాడికి మధ్య ఉండే ఒక సంఘర్షణ నేపథ్యంలో అన్ని కమర్షియల్ యాంగిల్‌లో చేసిన సినిమా ఇది. అవన్నీ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్‌ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కి ఏదైనా చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. -రామ్ అద్భుతమైన నటుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన రియల్‌గా ఒక ఫ్యాన్ లాగా నటించారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. ఒక రెట్రో ఫీలింగ్‌ని కలిగించే ఆ లవ్ స్టోరీ మనసును తాకే విధంగా ఉంటుంది. డైరెక్టర్ మహేశ్ బాబు.పి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అని అన్నారు.