అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఇప్పటికే 20సార్లు జనసేన కార్యాలయం వద్దకు వచ్చామని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎపిఐఐసికి తమ వ్యవసాయ భూములు ఇచ్చి నిరాశ్రయులుగా మారామన్నారు. ఇప్పటి వరకు పరిహారం అందలేదని వాపోయారు. 11వ తేదీన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. 15 రోజులు అయినా న్యాయం చేయలేదని రైతులు మండిపడుతున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ తమని ఇప్పటివరకు కలవడం లేదని వాపోయారు. పవన్ ను కలిసిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్తామని జనసేన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు.