మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం కూలిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుపోతున్న నీళ్లు కాళేశ్వరంవి కా వా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హ రీశ్‌రావు ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్ రావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బ్లా స్టింగ్స్ చూస్తే కాళేశ్వరం కూడా పేల్చారని అనుమానం వస్తుందని అన్నారు. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌నుకూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువు లు, చెక్ డ్యామ్‌ల పేల్చివేత నిత్య చర్యగా మా రిందన్నారు. గతంలో పెద్దపల్లి భోజన్నపేట వద్ద హుస్సేన్ మియావాగుపై కూడా చెక్ డ్యామ్ పేల్చివేశారని ఆరో పించారు. గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూడా కులలేదని.. పేల్చారని ఇక్కడి రైతులే చెప్తున్నార న్నారు.
ఇసుక మాఫియానే కూల్చివేసిందని, కాంగ్రెస్ పాలనలో వేల కొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు.రాత్రికి రాత్రి చెక్ డ్యామ్ పేల్చేశారని.. భోజన్న పే టలో హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యామ్ పేల్చివేస్తుంటే రైతులే పట్టుకున్నారన్నా రు. అప్పుడు రైతులే కేసులు పెట్టా రని.. పోలీసులు ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని ఆరో పించారు. తాజాగా మరో చెక్ డ్యామ్ పేల్చారని..అప్పుడే పోలీసులు దోషులను శిక్షిస్తే..ఈ రోజుగుంపుల చెక్ డ్యామ్కు ఈ పరిస్థితి రాకుండేదన్నారు. ఈరోజు వరకు పోలీసులు వాళ్లను పట్టుకోలే దని.. మూడు రోజు లు అయిన ఇక్కడి పేల్చవేత దోషులను పోలీసులు పట్టుకోలే కపోయారని ఆరోపించారు. కాం గ్రెస్ పార్టీ వాళ్లను కాపాడుతుందని.. ఆనాడు గుండాలను అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇక్కడి చెక్ డ్యామ్ పేల్చకపోయేవాళ్లని.. హైదరాబాద్లో ఇండ్లు, ఇక్కడ చెరువులు, చెక్ డ్యామ్లు కూలగొ డుతున్నారన్నారు. కేసీఆర్ కట్టుడు..కాంగ్రెసోళ్ల కూలగొ ట్టూడని.. మానేరు నది మీద చెక్ డ్యామ్లు కట్టి సస్యశ్యామలం చేశామన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌కు చెందిన రాఘవ కన్‌స్ట్రక్ష న్ కట్టిందని..చర్యలు తీసుకోవాలంటే పొంగులేటిపై తీసుకోవాలన్నారు.రాఘవ కంపెనీని బ్లాక్ చేయాలన్నారు. పొంగులేటి నుంచి రికవరీ చేయా లని డిమాండ్ చేశారు. ఏడాదికి 6 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పిండ ని..ఎక్కడ ఇచ్చారోచెప్పా లన్నారు. కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారని..రెండేళ్లు అయి న కాళేశ్వరం రిపేర్ చేయడం లేదని.. కాళేశ్వరం కింద ఉన్న కాలువలు తవ్వడం లేదన్నారు.
కాలువలు తవ్వితే కేసీఆర్‌కు పేరు వస్తుందని రైతును గోసపెడుతున్నారన్నారు. పెద్దపల్లిలో జిలిటెన్ స్టిక్స్తో కాంగ్రెస్ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని.. ఇసుక మాఫి యాతో రూ. 24 కోట్లు రికవరీ చేయాలన్నా రు. ఎండాకాలం లోపే చెక్ డ్యామ్ నిర్మించాలని.. ఇసుక మాఫియాలో మంత్రుల వాటా ఉందని.. రాత్రిపూట పెద్దశబ్దం వినపడిందని అని మత్స్యకారులు చెప్తున్నారన్నారు. లక్ష క్యూసెక్కుల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదన్నారు. కూలితే రాత్రే ఎందుకు కూలింది? కూలలేదు కూల్చారు అంటూ ఆరోపిం చారు. కాంగ్రె స్‌కు రైతుల కన్నా ఇసుక మాఫియా ముఖ్యమన్నారు. టెర్రరిస్టులు కూడా ఇ లాంటి పనులు చేయరని, టెర్రరిస్టులకు మిం చిపోయారని.. ఇసుక మాఫియా దోషులను శిక్షించకుంటే రాష్ట్రంలో మరిన్ని చెక్ డ్యా మ్లు పేలుస్తారన్నారు. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్ర రై తుల నోట్లో మట్టికొడుతున్నారని. కాళేశ్వరం కూలిందని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి రూ.8 వేల కోట్లతో హైదరాబాద్‌కు పైపులైన్ వేస్తా అంటున్నాడన్న హరీష్‌రావు.. మల్ల న్న సాగర్ ఎవరు కట్టారు నీ తాత కట్టిండా..? కేసీఆర్ కాదా? అంటూ ప్రశ్నించారు.ఇసుక మాఫియాపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందేనన్నారు. నిందితులు ఎవరైనా వారి నుం చి రూ.24 కోట్లు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.