గౌహటి: రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మరోసారి పీకల్లోతు కష్టాల్లోపడింది. బర్సపార స్టేడియం వేదిగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 549 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ఎదుట ఉంచింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్ (13) వెర్రెనెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. హార్మర్ బౌలింగ్‌లో రాహుల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 15.5 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు మరో 522 పరుగులు కావాల్సి ఉంది.