గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. నాలుగో రోజు 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. భారత బౌలర్లు సఫారీలను ఔట్ చేసేందుకు తెగ కష్టపడ్డారు. 77 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా నాలుగో వికెట్ 178 పరుగుల వద్ద కోల్పోయింది. స్టబ్స్, జోర్జిల జోడీ నాలుగో వికెట్‌కి 101 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ క్రమంలో జడేజా జోర్జి(49)ని ఎల్‌బిడబ్ల్యూ చేయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ముల్డర్‌తో కలిసి స్టబ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఐదో వికెట్‌కి 82 పరుగులు జోడించారు. అయితే 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టబ్స్ జడేజా బౌలింగ్‌లో సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చేసి.. భారత్‌కి 549 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చింది. భారత బౌలింగ్‌లో జడేజా 4 వికెట్లు తీయగా.. సుందర్ 1 వికెట్ తీశాడు.