గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ప్రోటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. నాలుగో రోజు రవీంద్ర జడేజా ఓపెనర్ రికెల్టన్(35)ను పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్క్‌రమ్(29)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్ బవుమా(3) సుందర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రస్తుతం 49 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టబ్స్(23), జోర్జి(37) ఉన్నారు. సౌతాఫ్రికా ప్రస్తుతం 420 పరుగుల ఆధిక్యంలో ఉంది.