భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (89) హీ మ్యాన్‌గా, యాక్షన్ కింగ్‌గా, రొమాంటిక్ హీరోగా త నకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రో జుల నుంచీ 70 ఎంఎం రోజుల వరకు ఈ లెజెండరీ నటుడు తనదైన నటనతో ప్రే క్షకులను ఎంతగానో అలరించారు. 300 కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్ మూ వీ షోలే, అన్‌పడ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దే శ్, డ్రీమ్ గర్ల్ తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మేంద్రకు భా ర్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని, తనయులు స న్నీ డియోల్, బాబీ డియోల్, కూతుళ్ళు ఇషా, అహనా ఉన్నారు.
తిరుగులేని స్టార్‌డమ్… బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జ న్మించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. ఆయన తండ్రి ఓ స్కూల్‌లో హెడ్మాస్టర్‌గా పనిచేసేవారు. ధర్మేంద్ర కూడా తండ్రి వద్ద చదువుకొనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రిక్యూలేషన్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగా రు. 1954లో ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర వివాహం జరిగింది. అయితే సినిమాలపై మక్కువతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన ముంబై వెళ్లారు. అదే సమయంలో ’ఫిలిమ్ ఫేర్’ మ్యాగజైన్ న్యూ టాలెంట్ సర్చ్ నిర్వహించగా అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. 1960లో ’దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో ఈ లెజెండరీ నటుడు సినీ రంగ ప్రవే శం చేశారు. షోలా ఔర్ షబ్నమ్ (1961), అన్ పడ్ (1962), బందిని (1963) చిత్రాలు ధర్మేంద్రకు నటునిగా మంచి గుర్తింపును తీసుకువచ్చి పెట్టాయి.
అనంతరం రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన ’ఆయీ మిలన్ కీ బేలా’లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆతర్వాత 1966లో హిట్ మూవీ ’ఫూల్ ఔ ర్ పత్తర్’లో కథానాయకుడిగా నటించి స్టార్ హీరోగా రాణించారు. ఈ సినిమా ఆధారంగా తెలుగులో ఎన్టీఆ ర్ హీరోగా విజయవంతమైన ’నిండుమనసులు’ (1967) చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక షికార్, ఇజ్జత్, ఆంఖే, ఆద్మీ ఔర్ ఇన్సాన్, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, దోస్త్, యాదోంకీ బారాత్, జుగ్ను, షోలే, మా, చరస్ వంటి బ్లాక్‌బస్టర్ మూ వీస్‌లో ధర్మేంద్ర నటించి తిరుగులేని స్టార్‌డమ్‌ను సం పాదించారు. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘షోలే’ చి త్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలి సి ధర్మేంద్ర నటించా రు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇండి యా సినిమా గతినే మార్చేసింది. తెలుగు వారు నిర్మించిన జానీ దోస్త్, వీరూ దాదా చిత్రాల్లో నటించారు ధ ర్మేంద్ర. తెలు గు దర్శకుడు తాతినేని ప్రకాశరావు రూ పొందించిన ’ఇజ్జత్’ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేసి అలరించారు.
హేమామాలినీతో రెండవ వివాహం… 1970లలో అందాల తార హేమామాలినీతో కలిసి ధ ర్మేంద్ర పలు హిట్ చిత్రాలలో నటించారు. చివరికి తన కు హిట్ పెయిర్‌గా సాగిన హే మామాలినిని ఆయన రెండో వి వాహం చేసుకున్నారు. ఆ సమయంలో భా ర్యాబిడ్డలు ఉండి మరో పెళ్ళి చేసుకోవడం వివాదానికి దారి తీ సింది. అయితే ముస్లిమ్ సంప్రదాయంలో పె ళ్ళి చేసుకోవడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ధర్మేం ద్ర, హేమామాలిని జోడీ. వీరికి ఇషా, అహనా సంతానం.
ఎన్నో అవార్డులు అందుకొని… చిత్ర పరిశ్రమకు ధ ర్మేంద్ర చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభు త్వం 2012లో పద్మభూషణ్ అవార్డుతో ఘ నంగా సత్కరించిం ది. 1997లో ఫిల్మ్‌ఫేర్ లై ఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అ వార్డును అందుకున్నారు. ఫాల్కే రత్న అవార్డును సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. ఇక బిజెపిలో చేరి 2004లో రాజస్థాన్‌లోని బికనేర్ నుంచి లోక్‌సభ ఎం పీగా గెలుపొందారు. ధర్మేంద్ర 1983లో విజేత ఫి ల్మ్ ఫేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తన పెద్ద కు మారుడు సన్నీ డియోల్ హీరోగా ఈ నిర్మాణ సం స్థలో ‘బేతాబ్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఘ నవిజయం సాధించి భారీ వసూళ్లను సాధించింది. 1990 లో నిర్మించిన ‘ఘాయల్’ సినిమా ఏకంగా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. రెండ వ కుమారుడు బాబీ డియోల్‌ను సొంత ప్రొడక్షన్ సం స్థలో హీరోగా పరిచయం చేస్తూ 1995లో ‘బర్సాత్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సా ధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది.
సినీ ప్రముఖుల సంతాపం… ధర్మేంద్ర మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ధర్మేంద్ర ఒక దిగ్గజ నటుడు మాత్ర మే కాదు. సహృదయం కలిగిన వ్యక్తి. ఆయనను కలిసి న ప్రతిసారీ ఎంతో ఆప్యాయతతో పలకరించేవారు. నా మిత్రులు సన్నీ డియోల్, బాబీ డియోల్ సహా ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ మా ట్లాడుతూ “ప్రముఖ నటులు ధర్మేంద్ర కన్నుమూశార ని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా ధర్మేంద్ర సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అందుకే ఆ యన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు”అని పేర్కొన్నారు.