జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతికూల ప్రభావాలను నివారించుకుంటూ… ఎఐ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. రాకెట్ కంటే పదిరెట్ల వేగంతో పుంజుకుంటున్న ఆర్ట్టిఫిషియల్ టెక్నాలజీలో మంచి చెడులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగుల భద్రతపై నిశితంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్ తన ఆధిపత్యాన్ని ఒక్కో రంగంలో చేజిక్కించుకుంటూ.. శతృదేశాల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అదే సమయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే.. తప్పులో కాలేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం.
ఆవస్యకత ఎంతో ఉంది. అయితే.. ఈ ఎఐ టెక్నాలజీ మంచికి దారి తీస్తుందా? చెడును దరికి చేరుస్తుందా? అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది! ఈ రోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ వాడకంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా టెక్స్, ఇమేజ్‌లు, కోడ్లను రూపొందించడానికి ఈ టెక్నాలజీని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే రోజురోజుకూ విస్తృతమైన వాడకం పెరగడంతో పాటు ఎఐ సంస్థల ఏర్పాటుకు, టెన్నాలజీని దత్తత తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆయా దేశాల సామర్థ్యాలను టెన్నాలజీతో అలంకరిస్తున్నాయి.ఈ విషయం కాస్తంత విస్మయానికి, ఆందోళనకు దారితీసింది. ఓపెన్ ఎఐ (ఓపెన్ ఎఐ) ఛాట్ జిపిటి (ChatGPT), చాట్సాట్ మేధస్సును ఇప్పుడున్న జనరేషన్ ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎఐ టెన్నాలజీ అనేది క్రమేణా అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన టెక్నాలజీ సంస్థగా అడుగులు వేస్తోంది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ టెక్నాలజీ డేటా సెట్లపై శిక్షణ పొందిన న్యూరల్ నెటవర్కర్ల మద్దతుతో, తగినంత కంప్యూటింగ్ పవర్‌తో కూడిన ఎఐ మోడల్స్, కొత్త యాంటీబయాటిక్, మిశ్రమాలను కనుగొనడంలో ముందుంది. అలాగే ప్రస్తుత అత్యాధునికకాలంలో అన్నితరాల వారికి పసందైన వినోదాన్ని అందించడం కోసం వినూత్న రీతిలో, వినోదంతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా సామాన్యమైన టాస్క్‌ల కోసం మంచి చేయడానికి ఉపయోగించారు. కానీ డేటాను తప్పుగా మార్చే సామర్థ్యంతో ఇది చాలా కంపెనీల వారి దృష్టిని ఆకర్షించింది. వాస్తవికతను విశ్వసనీయంగా ప్రతిబింబించే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో కొన్ని సందర్భాలలో సమాజంలోని చెడును విస్తరింపజేయడానికి కొంతమంది వినియోగించడం బాధాకరం. ఎఐతో రూపొందించే కథనాలు, స్కిట్స్, మినీ వీడియో క్లిప్లింగ్స్‌తో సమాజంపై దుష్ప్రభావం పెడేలా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపించడం దురదృష్టకరం.
ఈ నేపథ్యంలో చెడు -విశ్వాసలపై ప్రభావం చూపించడంతో ఎఐ టెన్నాలజీ ఆధారంగా రూపొందించిన డేటా మధ్య ప్రపంచం విశ్వసనీయతకు దూరంగా ఉంటుందన్న తేడాను గుర్తించగలిగింది. దీంతో ఈ టెక్నాలజీపై ఉన్న అభిప్రాయాలు రోజురోజుకూ రూపుమార్చుకుంటున్నాయి. ఇతర పరిణామాలు ఎఐ టెక్నాలజీ రూపకర్తల సమూహంలో హెచ్చరికల గంటలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎఐ నుండి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించడం అనేది మహమ్మారి అణుయుద్ధం వంటిదనే సంకేతాలను ప్రముఖులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇతర సామాజిక- స్థాయి ప్రమాదాలతో పాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని, ఎఐని ఉపయోగించే వారు తగిన క్రమశిక్షణతో లేకుంటే అదే సమాజంపై తీవ్ర పరిణామాలను తీసుకురావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిక్యూలలో పేర్కొన మరికొన్ని నిర్దిష్టమైన ఆందోళనలను కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. అయితే ఎఐ మోడల్స్ అంతర్గత పని తీరు అస్పష్టత, కాపీరైట్‌చేసిన డేటాను ఉపయోగించడం, మానవ గౌరవం, గోప్యతతోపాటు తప్పుడు సమాచారంనుండి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది.
నేడు అభివృద్ధి చేనసిన టెక్నాలజీతో పాటు, వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న మోడళ్లు అనుసరించడం తప్పనిసరి కాదని వివరిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి. ఎఐ మోడళ్లను పూర్తిగా అమలు చేయడానికి అవసరమైన వనరుల వినియోగదారులు కేవలం ఎలక్ట్రానిక్స్ విభాగంలోని వారే అందుబాటులో ఉన్న వాటితో సమస్యలను, ఇబ్బందులను సరిచేయడానికి వీలుంటుంది. అలాగే. పరిష్కారానికి వీలుగా ఉన్నప్పుడు కూడా, ప్రమాదకరమైన సంస్థలపై బ్రేకులు వేయడానికి ప్రజాస్వామ్య సంస్థల కు తలుపులు తెరిచి ఉంచే కనీసం రోలింగ్ విధానాలు ఈ ఎఐ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ సమయంలో, భారత ప్రభుత్వం ముందుగానే ఓపెన్ సోర్స్ ఎఐ రిస్క్ ప్రొఫైల్స్ ప్రారంభించి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్వహించాలి. అధిక- రిస్క్ ఉన్న ఎఐ మోడల్స్ పరీక్షించడానికి శాండ్బాకస్డ్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ ఆండ్ డి) పరిసరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలతో కూడిన సంస్థలు మన దేశంలో వినియోగించే టెక్నాలజీని వినియోగించేందుకు తగిన ఎఐ అభివృద్ధిని ఆచితూచి పరిశీలించిన తరువాతే ప్రోత్సహించాలి.
– వివి వెంకటేశ్వరరావు
63008 66637