హైదరాబాద్: శాలిబండలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలువాహనాలు దగ్ధమయ్యాయని లక్ష్మీ వస్త్రాలు యజమానులు ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.