ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బో ర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో కి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బా బు.పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఈ సినిమా 2002 సమయంలో జరుగుతుంది. అప్పు డు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం జరిగింది. – -సినిమాలోని సూర్య పాత్రలో ఉపేంద్ర సరిగ్గా సరిపోయారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. అభిమాని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి. కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ పూర్తిగా డిఫరెంట్, చాలా యూనిక్. రామ్ చాలా విలక్షణ నటుడు. ఆయన నటనలో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఇలాంటి క్యారెక్టర్‌కి రామ్ పర్ఫెక్ట్. -భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ… ఇలా ప్రతి క్యారెక్టర్ ఒక భావోద్వేగంతో ఉంటుంది. -వివేక్, మెర్విన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలో మ్యూజిక్‌ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు.