గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2 : తాండవం’. రామ్ ఆ చంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రా మ్, -లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి… బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ లో గన్, త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీ క్వెన్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఓ సన్నివేశం కోసం బాలకృష్ణ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చే శారు. ఒక పాత్రలో అంతగా లీనమైపో యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు ఉండడం మనందరికీ గర్వకారణం”అన్నారు.