గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా 55 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత జట్టు 340 పరుగుల వెనకంజలో ఉంది. సౌతాఫ్రికా బౌలింగ్ ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. యశస్వి జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్(58), కెఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), నితీశ్ కుమార్ రెడ్డి(10), రిషబ్ పంత్(07), రవీంద్ర జడేజా(6), ధృవ్ జురెల్(0), పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (22), కుల్దీప్ యాదవ్(2) పరుగులలో బ్యాటింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాలో బౌలర్లలో మార్కో జాన్సన్ నాలుగు వికెట్లు, సిమన్ హర్మర్ రెండు వికెట్లు తీయగా కేశవ మహారాజ్ ఒక వికెట్ తీశాడు.