ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా అలరించింది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్‌ను పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. టి సిరీస్ ఫిల్మ్, భద్రకాళి పిక్చర్స్ బ్యా నర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సందీప్‌రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ యా నిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రం లో ప్రభాస్‌కి జోడిగా నటించనుంది. ఈ కొత్త జోడీ వెండితెరపై కొత్త ఎనర్జీని తీసుకురానుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, ప్రముఖ నటీ కాంచన కీలక పాత్రల్లో కనిపిస్తారు. స్పిరిట్‌ను తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నారు.