గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ2 : ది తాండవంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అఖండ టీంని కలవడానికి సమయం తీసుకున్నారు. సినిమాలో రష్‌లను వీక్షించారు. ఈ సినిమా భారీ కాన్వాస్, భక్తి కథనం, అద్భుతమైన విలువలని ప్రదర్శించే విధానం చూసి ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు. అద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులకు అందరిలో ప్రతిధ్వనించే భక్తి చిత్రాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి నిర్మాతలను ప్రశంసించారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలో నిర్మించిన అఖండ 2ని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉత్తర భారతం అంతటా భారీగా విడుదల చేయనున్నారు.