మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సిఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో వైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ టూర్‌లో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉందని సమాచారం.