రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల్లో ఆదివారమే రిజర్వేషన్లు ఖరారైన నేపత్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.దాంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. గత కొంతకాలంగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో నాయకులు, యువకులు చొరవ చూపారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరు పోటీలో ఉంటారో దాదాపుగా ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.