విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్‌లో ఆయన మూడో సెషన్‌లో ఆదివారం టి, వినూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతికతు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం , కొందరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వనరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే తమ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు.
ఇండియన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చేసుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. అంతరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందరకి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయితే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌలిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుంది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్‌పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు.
అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు.