హైదరాబాద్: మధురానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. కార్మిక నగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. మొదటి అంతస్తులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించగా, సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.