ఈ హాస్యరస ప్రధాన చిత్రం ఈటీవీ విన్ యాప్ లో ఉంది. దీనిని రవిబాబు నిర్మించారు. మామూలుగానే అతను గ్రిప్పింగ్ స్క్రీన్-ప్లేతో సినిమాలను నడిపిస్తాడు. ఏనుగు తొండం ఏమిటి అంటే ఏనుగు తొండం అనేది ఇంటిపేరు అంతే. ఘటికాచలం అతని నామధేయం. నరేష్ ఆ పాత్రను చాలా అద్భుతంగా నటించాడు. ఇంకా చాలామంది మనకు తెలిసిన నటీమణులు నటులు ఇందులో ఉన్నారు..
ఘటికాచలం ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ అతని పెన్షన్ పైన అతని ఇద్దరు కొడుకులు ఆధారపడి ఉంటారు.. ఆ ఇద్దరి కొడుకులు ఏమి పని చేయకుండా అప్పులు చేసి తండరి పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. వాళ్ల ఇద్దరు భార్యలు, పెద్ద కొడుకుకున్న ఇద్దరు పిల్లలు పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. అందరూ అతని పెన్షన్ కావాలనుకుంటారు కానీ అతనికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్న సమయంలో తన తోడు కోసం తన పనిమనిషిని పెళ్లి చేసుకుంటాడు. పెన్షన్ లో భార్యకు వాటా పోతుందని పెద్ద కోడలు ఇతనికి ఐదు కోట్ల ఇన్సూరెన్స్ చేసి దానిని ఇతన్ని చంపేసి తీసుకోవాలి అని ప్లాన్ వేస్తుంది.. ఈ ప్లాన్ నుంచి ఘటికాచలం ఎలా తప్పించుకుంటాడు. ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ చేస్తారు అనేది సినిమా కథ..
ఇలా ఇన్సూరెన్స్ విషయమై ఇంతవరకు ముందు చాలా చిత్రాలు వచ్చినా కానీ ఇది విభిన్నంగా ఉంది. సినిమాకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే నే.. ఇందులో పెద్ద కోడలుగా నటించిన ఆవిడ, చిన్న కోడుకుగా నటించిన విజయ భాస్కర్ చాలా బాగా నటించారు. చిన్న కొడుకుకు నరేష్ లాగా మేకప్ వేసే సీన్లు హాస్యాన్ని పండిస్తాయి. అందులో అతను నవ్వకుండా మనకు మంచి హాస్యాన్ని అందిస్తాడు..
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఆలీ రఘుబాబు చాలామంది మనకు తెలిసిననటులే ఉన్నారు. మధ్యతరగతి భాగవతంలా ఉన్నప్పటికీ ఇది మరీ అంత డెప్త్ లేకుండా సూపర్ఫాఫిషియల్ గా హాస్యరస ప్రధానంగా నడుస్తుంది. ఓసారి చూడొచ్చు..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు