టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ని ఆమె వివాహమాడనుంది. ఇటీవల వీరిద్దరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు స్మృతి, తనకు కాబోయే భర్తతో క్రికెట్ మ్యాచ్‌లో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో టీమ్ బ్రైడ్‌కి స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమ్ గ్రూమ్‌కి పలాశ్ కెప్టెన్సీ చేశాడు.
స్మృతి జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, రాధా యాదవ్, రిచా ఘోష్ ఉన్నారు. సరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో స్మృతి జట్టు విజేతగా నిలిచింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఐసిసి వన్డే మహిళల ప్రపంచకప్ నెగ్గిన జట్టులో స్మృతి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్ గెలిచిన డివై పాటిల్ మైదానంలోని పిచ్‌పై పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక ఆదివారం వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
Smriti Mandhana is playing cricket with her soon-to-be husband Palash Muchhal at their wedding event.🙇🏻 pic.twitter.com/8o5nXiqijN
— Mention Cricket (@MentionCricket) November 22, 2025