హైదరాబాద్: పైరసీ వెబ్‌సైట్ల దందా ఆన్‌లైన్‌లో ఆగడంలేదు. మూవీ రూల్జ్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజైన అన్ని మూవీలను ముఠా పైరసీ చేసింది. ఐ బొమ్మ, బప్పం బ్లాక్ అయినా మూవీ పైరసీ ఆగడంలేదు. థియేటర్‌లో కెమెరాలతో రికార్డుచేసి నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మూవీ రూల్జ్ వెబ్‌సైట్ ముఠా తీరు మాత్రం మార్చుకోవడంలేదు.
ఇప్పటికే ఐ బొమ్మ రవి పైరసీపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఐ-బొమ్మ రవిని నాలుగో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.. హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించిన కూడా ఐ-బొమ్మ రవి నోరు మెదపడంలేదు . మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీల ఫోకస్ పెట్టాయి. ప్రముఖ ఓటిటిల ఫిర్యాదులతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.