అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తరాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధ్యప్రదేశ్ కు చెందిన కులాస్ సింగ్(62), సంతోషి(62), సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.