హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎదుట అజ్ఞాతంలో ఉన్న 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజినల్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు డిజిపి తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాస్ నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర లొంగిపోయిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగితా మావోయిస్టులు అందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు. ఖమ్మం డివిజినల్ కమిటీకి చెందిన వారు 9 ఉన్నారని, దక్షిణ బస్తర్ కమిటీకి చెందిన వారు 22 మంది ఉన్నారని అన్నారు. లొంగిపోయిన ఆజాద్‌పై, అప్సాస్ నారాయణపై తలో రూ.20 లక్షల రికార్డు ఉందని.. అది వాళ్లకే అందజేస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన అందరిపై కలిపి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని తెలిపారు.