గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు సపారీలు 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. ఎడెన్ మక్రమ్ 38 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యారు. రికెల్టన్ 35 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో తెంబా బవుమా(4) , ట్రిస్టన్ స్టబ్స్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.